మంత్రి అయ్యే అన్ని అర్హతలు నాకున్నాయి..?

 మంత్రి అయ్యే అన్ని అర్హతలు నాకున్నాయి..?

FIR ON YSRCP MLA

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన కానీ ముఖ్యనేతలైన రాహుల్ గాంధీ,సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వస్తున్నారు.

దీంతో దసరాకు జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ కాస్త దీపావళికి వాయిదా పడింది. మిగిలిన ఆరు శాఖలపై అశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పార్టీలో నేను సీనియర్ ను.. నాకు మంత్రి పదవి వచ్చే అన్ని అర్హతలు ఉన్నాయి. మంత్రి పదవిని నేను ఆశిస్తున్నాను. మంత్రి పదవి ఎవరికివ్వాలనేది ఆధిష్టానం చూస్కుంటుంది. పార్టీ కోసం కష్టపడే వాళ్లకు న్యాయం చేయాలని కోరారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *