జగ్గారెడ్డి ఓ ఫైటర్..?
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఓటమి మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి ఆయన కోటాలోనే నా సతీమణీకి పదవిచ్చారు.
ఏ పండుగ వచ్చిన.. ఏ పబ్బం వచ్చిన నేను ముందు ఉండి సంగారెడ్డిలో వేడుకలు నిర్వహిస్తాను.. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎస్పీ నన్ను కోట్టారు. నా అనుచరులను కొట్టారు. నేను కారుతో వెళ్ళి ఆయన్ని ఢీకొట్టాను.. పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేయించాను.. మూడు వేల మందితో పీఎస్ కెళ్లాను అని అన్నారు. పైసలు ఇవాళ ఉంటాయి..
రేపు పోతాయి.. ఎంత తోపులం అయినా సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదని… వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల గానీ.. ఆంజనేయులు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది.జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు.