ఉప్పల్ లో టీమిండియా రికార్డుల మోత

Big shock for Bangla star cricketer…!
3 total views , 1 views today
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20ఓవర్లకు ఆరు వికెట్లను కోల్పోయి 297పరుగులు చేసింది.
298పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 164పరుగులు చేసింది. దీంతో టీమిండియా 133పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది.ఉప్పల్ వేదికగా టీమిండియా సృష్టించిన రికార్డులు ఈ విధంగా ఉన్నాయి.
టెస్ట్ హోదా ఉన్న జట్టు టీ20లో చేసిన అత్యధిక స్కోర్ గా 297పరుగులు నమోదయ్యాయి. టీ20ల్లో టీమిండియా జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.ఈ ఇన్నింగ్స్ లో ఇండియా ఆటగాళ్లు అత్యధికంగా 22సిక్సర్లు నమోదు చేశారు. భారత్ తరపున ఫాస్టెస్ట్ వంద పరుగులు7.2ఓవర్లలోనే నమోదైంది.. ఫాస్టెస్ట్ రెండోందల పరుగులు నమోదైంది కేవలం 13.6ఓవర్లులోనే..
