మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Sabitha Indra Reddy Telangana ex Education Minister. -Former Home Minister of the State of United Andhra Pradesh.
4 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్‌దేవుపల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లో నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా నవరాత్రి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారు.. తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు..రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ ఆండగా నిలచి దీవించాలి..
రాజేంద్రనగర్ నాకు పుట్టినిల్లు లాంటిది అని ఆమె అన్నారు.దీంతో రానున్న రోజుల్లో సబితా తనయడు పటోళ్ళ కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్ నుండి బరిలోకి దిగనున్నట్లు పరోక్షంగా క్యాడర్ కు ప్రజలకు సంకేతాలు పంపినట్లైంది..
