రేవంత్ రెడ్డి సర్కారుకి హైకోర్టు చురకలు…?
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అమీన్ పూర్ హైడ్రా బాధితులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ” గతంలో ఇచ్చిన ఆదేశాలను చదివే టైం లేదు .. కానీ కూల్చివేతలకు సమయం ఉంటుందా..?. మీరు శనివారం ,ఆదివారాల్లో మాత్రమే ఎందుకు కూల్చివేతల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. బడా బాబులకు ఒక రూల్.. పేద వాళ్లకు ఒక రూల్ అమలు చేస్తున్నారా..?. హైడ్రా రూల్స్ ఇలాగే తయారు చేశారా..?. హైకోర్టు అంటే మీకు లెక్క లేదా అని ప్రశ్నించింది.
మీరు నియమనిబంధనలు అతిక్రమిస్తే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. నోటీసులిచ్చాక అందుకున్నవారికి సమయం ఇవ్వాలి.. వారి స్పందనను బట్టి కదా మీరు చర్యలు తీసుకోవాలి కదా.. మీకిష్టమోచ్చినట్లు చర్యలు తీసుకోవచ్చు అని ఏ చట్టం చెబుతుంది అని రేవంత్ సర్కారుకి చురకలు అంటించింది.