దేవర మూవీలో ఆ సీన్లు కట్ చేశారా..?

Devara Movie Review
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజు, అజయ్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర.. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీలో కొన్ని సీన్లు కట్ చేశారని తెలుస్తుంది.
పాన్ ఇండియా మూవీగా వచ్చిన దేవర అన్ని వర్గాల అభిమానులను ఆలరిస్తుంది. హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పిన ఎన్టీఆర్ అక్కడ కూడా ప్రేక్షకులను ఆలరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మొత్తం రెండు గంటల యాబై నిమిషాల రన్ టైం ఉన్న ఈ మూవీని హిందీ ప్రేక్షకుల కోసం ఏడు నిమిషాల పాటు ట్రిమ్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు సంబంధించిన కొన్ని సీన్లను సోలో సన్నివేశాలను హిందీ వెర్షన్ లో కట్ చేశారని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తం మీద ఆరేండ్ల తర్వాత సింగల్ గా వచ్చిన ఎన్టీఆర్ దేవర హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.