రేపే దేవర -ఆ సెంట్మెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా..?
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ – 1 మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకు ఓ టెన్షన్ మొదలైంది. అదే ఏంటీ తమ అభిమాన హీరో మూవీ విడుదలవుతుంటే అభిమానులంతా సంబరంతో ఉంటారు కానీ టెన్షన్ తో ఎందుకుంటారనే కదా మీ డౌటానుమానం.
ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరో తర్వాత మూవీ ప్లాప్ అవుతుందనే నెపం ఒకటి ఉంది. ఇది ఓ అనవాయితే కాదు సెంట్మెంట్ లా కూడా ఫీలవుతుంటారు.
గతంలో సింహాద్రి, యమదొంగ,ఆర్ఆర్ఆర్ లాంటి మూవీలు ఎన్టీఆర్ తో.. బాహుబలి ప్రభాస్ .. విక్రమార్కుడు రవితేజ…మగధీర, ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ తేజ్, మర్యాద రామన్న సునీల్ లతో తీశాడు రాజమౌళి.. ఆ తర్వాత వీళ్ళు నటించిన మూవీ ప్లాప్ లయ్యాయి. అంతే తాజా మూవీ విడుదలపై కూడా అదే టెన్షన్ ఉందంట. మరి ఆ అనవాయితీని సెంట్మెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి మరి..?