డా. మల్లు రవితో ఆర్ కృష్ణయ్య భేటీ..?. మతలబు ఏంటో..?

mallu ravi met krishnaiah
బీసీ నేత.. నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా.?. కాంగ్రెస్ లో చేరితే ఆర్ కృష్ణయ్య కు అత్యున్నత స్థాయి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందా..?. తమ పార్టీలో చేరితే క్యాబినెట్ హోదా ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారా..?.
అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసానికెళ్ళి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తుంది.
వైసీపీ తరపున ఏపీ నుండి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో చేరాలని రవి ఆహ్వానించారని తెలుస్తుంది. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ లో చేరితే సముచిత స్థానం ఇస్తామని రవి భరోసానిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ బీసీ నేత అడుగులు ఏటువైపో..?