నాడు తిట్టినోళ్ళే.! నేడు జైకొడుతున్నారు.. !ఎందుకు..?
2019 ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఓటమి.. ఆ పార్టీ తరపున గెలిచింది ఒకటే సీటు.. ఆ ఒక్కరూ సైతం తర్వాత వైసీపీలో చేరారు.. పవన్ పని అయిపోయింది.. జనసేనను జనం ఆదరించలేదు.. ఇక పవన్ సినిమాలు చేస్కోవాలంటూ వైసీపీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి మంత్రులు.. ముఖ్యమంత్రి వరకు తిట్టని తిట్లు లేవు.. చేయని విమర్శ లేదు.. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా పరుష పదజాలంతో జనసేనాని టార్గెట్ చేశారు.
కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. దీంతో వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రులు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. రాజకీయాలు అంటే మార్పులు చేర్పులు కామన్ కానీ నాడు తిట్టినవాళ్ళే నేడు జనసేన వైపు రావడమే ఇక్కడ విశేషం.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి,ఉదయభాను సామినేని తదితరులంతా వైకాపాను వీడి జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు.
వీరే కాదు ఇంకా చాలా మంది మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి సిద్ధమైనట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్. ఐదేండ్ల పాటు మైకు ముందు ఉంటే చాలు నోటికి అడ్డు అదుపు లేకుండా పవన్ ను తిట్టినోళ్ళు సైతం నేడు జైకొట్టడానికి సిద్ధమవ్వడమే పవన్ స్టామినా ఏంటో ఆర్ధమవుతుంది.. జనసేన కు ప్యూచర్ ఉంటది .. అందుకే వారి చూపు ప్రస్తుతం ఇటువైపు ఉందని రాజకీయ వర్గాల గుసగుసలు.