బీఆర్ఎస్ పై ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు.
జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము..
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలోకి దిగుతాము.. బీఆర్ఎస్ వక్ఫ్ బోర్డు, జైనూర్ ఘటనపై మౌనంగా ఉంది అని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు,జైనూర్ ఘటనలపై ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..