తల్లికి వందనం పథకం పై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు
Minister Nimmala Ramanaidu
![]()
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకం గురించి మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం పై అపోహాలు అవసరం లేదు..
ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము.. ఇంట్లో ఓ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇచ్చి తీరుతాము.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొమ్మిది నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు..
మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవకముందే తల్లికివందనం పథకం అమలు చేయలేదని నిందారోపణలు చేస్తున్నారు.. రూ. 15వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారు. ఐదేండ్లలో ఒక్క ఏడాది కూడా ఆ పథకాన్ని అమలు చేయలేదు అని మంత్రి రామానాయుడు విమర్శించారు.