ఔను…! వాళ్లిద్దరూ ఒకటయ్యారు…?
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అన్నట్లు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్ ను చూస్తే అన్పిస్తుంది .. తనపై లైంగిక దాడి చేసినట్లు అదే పార్టీకి చెందిన మండల అధ్యక్షురాలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే.
దీంతో పోలీసులు బాధితురాలికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను హైకోర్టులో సమర్పించారు.. మరోవైపు టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే కోనేటి పై వేటు కూడా వేసింది. కానీ తాజాగా బాధితురాలి తరపున న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్ లో కళ్లు బయ్యర్లు కమ్మేలా కొన్ని విషయాలను పొందుపరిచారు.
దానిలో ఈ కేసును తాము వాపసు తీసుకుంటున్నాము.. ఎలాంటి లైంగిక దాడి చేయలేదు.. ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లు నాలుగు సార్లు లైంగిక దాడి జరగలేదు.. అది అంత అబద్ధం.. ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసును వాపస్ తీసుకుంటున్నాము అని బాధితురాలి తరపున న్యాయవాది పేర్కొనడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. దీనిపై నెటిజన్లు తెగ విరుచుకుపడుతున్నారు..
తనపై ఎమ్మెల్యేనే లైంగిక దాడి చేశారని ఏకంగా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి మరి చెప్పిన బాధితురాలు ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేశారు.. ఈ మధ్యలో ఏ మతలబ్ జరిగింది.. ఇలా తమకు అనుకూలమైన చట్టాలను వినియోగించుకుని ఇలా చేయడం కరెక్టేనా.. లైంగిక దాడి జరిగింది నిజమా. అబద్ధమా..? నిజమైతే వారిద్దరూ ఒకటయ్యారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.