“యో సుస్కోబాడ్లా” నాగబాబు ..?

 “యో సుస్కోబాడ్లా” నాగబాబు ..?

Nagababu Mega Brothers

నాగబాబు కొణిదెల .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీచ్చి మెగా బ్రదర్స్ గా పేరుగాంచిన నటుడు.. ఆ తర్వాత ప్రజారాజ్యం … జనసేన పార్టీలలో క్రియాశీలకంగా ఉంటూ అందరికి సుపరిచితులయ్యారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ ఇష్యూలో తనదైన శైలీలో స్పందించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ” డోంట్ బిలీవ్ ఎవిరితింగ్ యూ హియర్..దేర్ ఆర్ త్రీ సైడ్స్ ఆఫ్ ఏ స్టోరీ.. యూవర్స్,దేర్స్ మరియు ట్రూత్ “అని రాబర్ట్ ఎవెన్స్ కోట్ ను ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనర్ధం ” జానీ మాస్టర్ తప్పు చేశాడో లేదో న్యాయస్థానం.. పోలీసు వ్యవస్థ తేలుస్తుంది. అప్పటి వరకు మీరు నమ్మోద్దు అని చెబుతున్నారా నాగ బాబు గారు అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

మీరు చెప్పిందే నిజమైతే మీ తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాలని ఆదేశించారు.. మీరు మీ తమ్ముడుకి ఇది చెప్పారా మరి..? అంటే మీరు జానీ మాస్టర్ ను సపోర్టు చేస్తున్నారా..?. లేదా బాధితురాల్ని అనుమానిస్తున్నారా..? .. ట్వీట్ చేసేముందు “యో సుస్కోబాడ్లా” నాగబాబు ..? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *