సీఎం రేవంత్ అత్తగారి ఊరిలో పడకేసిన వైద్యం.. ?

Revanth Reddy struggles for one day headline..!
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత అత్తగారి ఊరిలో అధికారుల కొరత.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఆయన అత్తగారి స్వంత ఊరైన మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న ప్రధాన శాఖలైన విద్య, వైద్య, రెవిన్యూ ,ఇందిర క్రాంతి పథకం వంటి పలుశాఖల కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలుస్తుంది. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న డిప్యూటీ తహశీల్దార్ ఈ నెల తొమ్మిదో తారీఖు నుండి సెలవుపై వెళ్లారు. దీంతో గత పది రోజులుగా రెవిన్యూ సంబంధిత పనులన్నీ ఆగిపోయాయి.
రెవిన్యూ శాఖాలో ఈ పోస్టుతో పాటు సీనియర్ అసిస్టెంట్, గిర్ధావర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మాడ్గుల ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలంటే ప్రభుత్వ శాఖాల్లో అధికారుల కొరత లేకుండా చూడాలి.. అలాంటిది రెవిన్యూ శాఖాలోనే అధికారుల కొరతతో రిజిస్ట్రేషన్లు, పథకాల అందడం లాంటివి ఆగిపోయాయని వారు అంటున్నారు.
మరోవైపు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై నాలుగంటల వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు,టెక్నికల్ సిబ్బంది,ఎఎన్ఎం ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. దీంతో పాటు ఉన్న సిబ్బంది రెగ్యులర్ గా విధులకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందని ఆసుపత్రులకు వచ్చే బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత అత్తారి ఊరిలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను తాము ఆర్ధం చేస్కోగలము అని వారు అంటున్నారు. ఇప్పటికైన ఇలాంటి సమస్యలకు ప్రజాపాలనలో చెక్ పెడతారని మాడ్గుల ప్రజలు కోరుకుంటున్నారు.