కప్పు కాఫీతో గుండె పదిలం
కొంతమంది కాఫీ టీ తాగోద్దని చెబుతుంటరు.. మరికొంతమంది టీ తాగొద్దంటరు. ఇంకొంతమంది ఈ రెండింటీకి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు అని చెబుతుంటరు. మీరు ఏంటీ కాఫీ తో గుండె పదిలం అని చెబుతున్నరని ఆలోచిస్తున్నారా.?. నిజమేనండీ మూడు కప్పుల కాఫీ తో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందంట. ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నయని ఓ ఆధ్యయనం లో తేలింది.
ఆ ప్రకారం మధుమేహాం ,స్థూలకాయం , ఫ్యాటీ లివర్ సహా అనేక జీవ క్రియలకు సంబంధించి అనారోగ్యాల ముప్పు అవకాశాల తీవ్రతను 40-48% వరకూ తగ్గిస్తుంది. కెఫిన్ (కాఫీ) తీసుకునే 1.72లక్షల మంది సమాచారాన్ని చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో వీరిలో ఏ ఒక్కరూ కూడా గుండె సంబంధిత జీవక్రియల (హార్ట్ అటాక్, స్ట్రోక్)ఇబ్బందులను ఎదుర్కోవడం లేదని గుర్తించారు.
అలాగే వారంతా రోజుకూ మూడు కప్పుల కాఫీ(200-300మిల్లీ గ్రాముల) తీసుకోవడం ద్వారా స్థూలకాయం ,అధిక కొలెస్ట్రాల్ ,మధుమేహాం ,మద్యపానేతర ఫ్యాట్ లివర్ వ్యాధులు వృద్ధి చెందే ముప్పును నలబై నుండి నలబై ఎనిమిది శాతం తగ్గించుకోగలిగారని గమనించారు. అందుకే కుదిరితే మూడు కప్పుల కాఫీ తీసుకోండి.