Breaking News – ప్రతి ఇంటికి రూ. 25000

India Loss The Match
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎదురైన భారీ వరదలకు ముంపుకు గురైన బాధితులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన ప్రతి ఇంటికి రూ.25,000లు ఇస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి రూ. 10,000చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుఖానాలు మునిగిన వారికి రూ. 25,000 నష్టపరిహారం కింద ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయం చేసి వరద బాధితులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.