జగన్ బాటలో పవన్ నడుస్తాడా…?

 జగన్ బాటలో పవన్ నడుస్తాడా…?

Pawan Kalyan Will Follw The Way Of Jagan

Loading

అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు..

అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత విమర్శలు అయితే తారస్థాయికి వెళ్లాయి.. ఆ తర్వాత ఎన్నికలైనాక జనసేనాని ఎన్నికల్లో మాత్రమే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు.. ఇప్పుడు మనకు వైసీపీ శత్రువులేమి కాదు. మనం వాళ్లను అలా చూడాల్సినవసరం లేదు. ఇప్పుడు రాజకీయ వ్యక్తిగత విమర్శలు వద్దు అని స్ట్రిక్ట్ గా జనసేనాని జనసైనికులకు సూచించారు. గత మూడు నెలలుగా వాళ్ళు అలానే ఉంటున్నారు.

తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించడానికెళ్లినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు పవన్ దత్తపుత్రుడు.. ముగ్గురు పెళ్ళాల ముద్దుల పెళ్లి కొడుకు అని వ్యక్తిగత విమర్శలతో పాటు ఫ్యాకేజీ స్టార్ అని రాజకీయ విమర్శలు చేసే జగన్ ఈసారి చాలా మెట్లు కిందకు పవన్ కేవలం సినీ ఆర్టిస్ట్ .. బాబు రియల్ ఆర్టిస్ట్.. పవన్ కు ఏమి తెలియదు.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది పవన్ కు అనుకూలంగా సానుభూతి వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ మారిపోయాడు.. ఎప్పుడు విమర్శించే జగన్ ఈసారి తగ్గి మాట్లాడాడు. ఇలాగే ఉంటేనే వైసీపీకి బలం అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరి జగన్ మారిండు.. పవన్ కూడా మారతాడా..?. జగన్ నడిచిన మార్గంలోనే పవన్ నడుస్తాడా..?. కేవలం రాజకీయ సిద్ధాంత ఫరంగా విమర్శలు తప్పా వ్యక్తిగత విమర్శలు చేయకుండా పవన్ కళ్యాణ్ విమర్శిస్తారా..? . గత ఎన్నికల్లో పవన్ ను జగన్ టార్గెట్ చేయడంతొనే కాపు బలిజ నాయుడు ఓట్లు జనసేనకు గుంపగుత్తగా పడ్డాయి.. అందుకే జగన్ అది తెల్సుకుని పవన్ తో శత్రుత్వం కంటే మిత్రుత్వం మంచిది అని భావించారు. అందుకే ఇలా వ్యాఖ్యలు చేశారు. మరి పవన్ కూడా ఇలా ఉంటరో.. ఉండరో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే పవన్ మెంటాలిటీ ప్రకారం తనని ఎవరూ ఏమనని అన్నంతవరకు ఎవర్ని ఏమి విమర్శించరు.. శృతిమించితే.. తనను టార్గెట్ చేస్తేనే ఎదుటివాళ్లను విమర్శిస్తారు .. ఇది మనకు తెల్సింది. జగన్ సైలెంట్ అయ్యారు. పవన్ అవుతారా మరి..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *