కేజ్రీవాల్ రాజీనామా వెనక అసలు ట్విస్ట్ ఇదే…?
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది.
నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అప్పుడు ఎన్నికలకు వెళ్తే గత ఏడాదిన్నరగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్టులతో ఆప్ ను ఆప్ కు చెందిన నేతలను ఇబ్బంది పెట్టిన తీరు తమకు సానుకూల పవనాలను అందించదు. అదే ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమకు కల్సి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆప్ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు దాదాపు ఇరవై ఐదేండ్ల తర్వాత ఎప్పుడు ఎన్నికలోచ్చిన సరే ఈసారి ఢిల్లీ పీఠం తమదేనన్న అపార నమ్మకంతో బీజేపీ శ్రేణులు కాచుకూర్చున్నారు.. నవంబర్ లో మహారాష్ట్ర తో పాటు ఎన్నికలకు వెళ్తే ఆప్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే ఉద్ధేశ్యంతోనే అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.