వీరమల్లు గురించి క్రేజీ అప్డేట్

Hari Hara Veeramallu Crazy Update
7 total views , 1 views today
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముంగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను చేయడానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీనికోసం పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉండే విజయవాడ సమీపంలో బ్లూసెట్ ను సిద్ధం చేశారు చిత్రం యూనిట్ . అందులోనే మిగతా చిత్రీకరణ జరగనున్నది. ఈ నెల మూడో వారం నుండి ముఖ్య పాత్రలపై సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నది. పవన్ కు సంబంధించి ఇరవై రోజుల షూట్ మిగిలి ఉంది.
ఇప్పటికే షూటింగ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షూట్ ప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే పవన్ ఎంట్రీస్తారు. పవన్ పై చిత్రీకరణ తర్వాత సినిమా పూర్తైతది. దాన్ని పూర్తి చేసిన వెంటనే విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం యూనిట్ తెలిపారు.
