కాంగ్రెస్ పాలనలో మరో రూ.750 కోట్ల కుంభకోణం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు.
అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆరోపించారు.
వడ్ల కొనుగోలు కోసం పిలిచిన టెండర్లో రూ. 750కోట్ల అవినీతి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల టన్నుల వడ్ల కొనుగోలు టెండర్లలో అవకతవకలు జరిగాయి. నష్టాల్లో ఉందని ఒకవైపు ప్రభుత్వం చెబుతూనే మరోవైపు సరికొత్త కుంభకోణానికి తెరతీసింది. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.