పవర్ తగ్గని ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా

 పవర్ తగ్గని ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా

Roja’s entry into movies again…!

Loading

ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్.. మీడియా ముందు ఆమె మాటలు తుటాలు.. పంచ్ కు ఎదురులేదు.. సవాల్ కు ప్రతిసవాల్ ఉండదు. అంతలా మీడియా ముందు ఆర్కే రోజా రెచ్చిపోయారు. ఒక్కొక్కసారి ఆమె తీరు పార్టీకి ప్లస్ అయ్యేవి.. మరోకసారి మైనస్ అయ్యేవి. అయితే పార్టీ ఓటమికి తన తీరు కూడా ఒక ప్రధాన కారణం అని తర్వాత తెల్సింది. అది వేరే ముచ్చట అనుకోండి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ తేడాతో ఓడిపోయింది ఆర్కే రోజా.

తన ఓటమికి కారణమైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పని చేసిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అయిన కేజే కుమార్ ,ఆయన సతీమణీ అయిన కేజే శాంతి (ఈడిగ రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్ పర్శన్)లపై సస్పెన్షన్ వేటు వేయించారు రోజా.. దీనికి సంబంధించి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు భరత్ ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు.ఈ ప్రకటనలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి వైసీపీ నేతలు కేజే కుమార్, కేజే శాంతిలు టీడీపీ పార్టీకి పని చేశారని నివేదికలు వచ్చాయి.

అవి నిజం అని తేలడంతో వారిద్దర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాము.. వారిపై తీసుకున్న నివేదికల ద్వారా వారు పని చేసింది నిజమే అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు.. సిద్ధాంతాలకు వ్యతిరేక క్రియలకు పాల్పడిన వారు ఎంతటివారైన పార్టీ కి నష్టం చేకూర్చే వాళ్లను సహించము అని ఆయన పేర్కొన్నారు.. ఓడిన కానీ ఆర్కే రోజాకు పార్టీలో ఏమాత్రం పవర్ తగ్గలేదన్నమాట అని వైసీపీ శ్రేణులు,రోజా అభిమానులు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *