షర్మిల ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి..?
వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు పోవాలి అనే నినాదంతో ఏపీ యువతను వైసీపీ వైపు చూసేలా.. జగన్ కు ఓటేసే విధంగా షర్మిల కాలికి ఫ్యాన్ కట్టుకుని మరి తిరిగారు.
అధికారంలోకి వైసీపీ వచ్చాక కొన్ని కొన్ని లోపాల వల్ల షర్మిల ఏపీని వదిలి తెలంగాణకు వచ్చారు.తెలంగాణలో పార్టీ పెట్టారు. ఎన్నికలకు ముందుదాక నేను ఆడపిల్లను కాదు ఈడ పిల్లనే.. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగాను.. నేను వైఎస్సార్ బిడ్డను.. మీ బాధలు నాకు తెల్సు .. మీ గుమ్మం నాకు తెల్సు అంటూ ఎన్నికలకు ముందుదాక కేసీఆర్ & బీఆర్ఎస్ ను తిట్టని తిట్టు లేదు.. విమర్శించని రోజు లేదు.. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పరోక్షంగా కాంగ్రెస్ కు సపోర్టు చేసిందనే వాదనలున్నాయి. ఆ తర్వాత ఏపీకి వెళ్లి టీడీపీ వైసీపీ దొందు దొందే.. వైసీపీ టీడీపీకి బుద్ధి చెప్పాలని.. కాంగ్రెస్ ను ఆదరించండి..
వైఎస్సార్ బిడ్డను దీవించండి అంటూ ఎన్నికల సమరంలో దిగి ఒక్క సీటు కాదు కదా కనీసం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తన అన్న జగన్ అధికారం కోల్పోవడానికి మెయిన్ కారణం అయిందని కూడా ఇటు వైసీపీ వైఎస్సార్ అభిమానులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..ఈ కారణంతోనేమో వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు.
ఇటీవల వరదల గురించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” వరదలు ప్రభుత్వాల వైఫల్యం. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదలు రావడం సాధారణం.. రెయినింగ్ సీజన్ కాబట్టి రెయిన్స్ వస్తాయి అని అప్పట్లో ఆడపిల్ల అని ఎందుకంటరో తెలుసా ఆడ పిల్ల కాబట్టి అన్నట్లు తాజాగా తనదైన శైలీలో ఆమె విమర్శలు చేశారు. ఈ విమర్శలను కోట్ చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ వైఎస్ షర్మిలను ఏపీ ప్రభుత్వాన్ని తిట్టిందో.. తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టిందో ఆర్ధం కాక చస్తున్నారు..
ఆమె ఎన్నికలకు ముందు ఐదేండ్లు తెలంగాణలోనే ఉంది.. అక్కడే రాజకీయం చేసింది.. కాబట్టి ఆమె తిట్టింది తెలంగాణ ప్రభుత్వాన్నే.. ప్రశ్నించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే. కానీ ఏపీ ప్రభుత్వాన్ని కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబును కాదు. ఇప్పటికైన తన దారి ఏంటో వైఎస్ షర్మిల తెలుసుకోవాలని ఆయన సూచించారు.