పీకల్లోతు నీటిలో ఎన్టీఆర్.. ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిన్న మంగళవారం విడుదలైన దేవర పార్ట్ – 1 మూవీ ట్రైలర్ ఓ ఊపు ఊపుతుంది. మాస్ క్లాస్ అన్ని అంశాలతో కూడిన ఆ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిమాలను అలరిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సమర్పణలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడో తారీఖున పాన్ ఇండియా లెవల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.
అయితే ఈ చిత్రంలో షార్క్ తో ఓ పైట్ సీన్ ఉంటుంది. దాదాపు ఆ ఫైట్ అంతా నీటిలోనే చేయాల్సి ఉంటుంది.. ఆ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అని చిత్రం యూనిట్ తో పాటు హీరో జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. ఈ సీన్ చిత్రీకరణ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు అంట. ఒక సీన్ మంచిగా రావడం కోసం ఓ నటుడు ఎంతగా శ్రమిస్తాడో ఇది మరో ఊదాహరణ అని చెబుతున్నారు.
ఫైట్ సీన్ నేచురల్ గా.. బాగా రావడం కోసం పీకల్లోతు నీటీలో రోజంతా అంటే ఇరవై నాలుగంటలు పాటు ఎన్టీఆర్ నీటిలోనే ఉన్నాడంట. అది కూడా రెండోందల అడుగుల పొడవు.. వంద అడుగుల వెడల్పు . ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంకులో ఉన్నాడంట.కేవలం షాట్ ఒకే కావడం కోసమే రోజంతా అందులో ఉన్నాడు. చివరికి షాట్ ఒకే కావడంతో అప్పుడు హీరో బయటకు వచ్చాడంట. ఇది అన్నమాట పీకల్లోతు నీటీలో ఎన్టీఆర్ వెనక ఉన్న అసలు మ్యాటర్.