GHMC లో అర్హులకందని ‘గృహజ్యోతి’
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటి రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్.. జీరో కరెంటు బిల్లు. మహిళలకు నెలకు రూ 2500. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకం గురించి దేవుడెరుగు.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని మహానగరంలో ఆ పథకం ఆటకెక్కింది అని అర్హత ఉన్న లబ్ధి పొందని మహిళమణులు వాపోతున్నారు. మాములుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో విద్యుత్ బిల్లు, వంట గ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులుగా ఎంపిక చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం పదిహేడు లక్షలకు పైగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులున్నారు.. 14లక్షల మందికి గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. ఇందులో కేవలం 7.4లక్షల మందికి మాత్రమే జీరో విద్యుత్ బిల్లు పథకం అమలు అవుతుంది. మరోవైపు కేవలం 3లక్షల మందికే వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుంది.
హైదరాబాద్ పరిధిలో 6,36,617లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులుండగా కేవలం 2,28,069లక్షల మందికి మాత్రమే జీరో కరెంటు బిల్లు వస్తుంది. మరోవైపు రంగారెడ్డి పరిధిలో 5,59,788 లక్షల మంది రేషన్ కార్డుల దారులుండగా 2,83,877లక్షల మందికి.. మేడ్చల్ పరిధిలో 5,24,449లక్షల మంది రేషన్ కార్డుల దారులుండగా వీరిలో కేవలం 2,28,566మందికి మాత్రమే జీరో కరెంటు బిల్లు వస్తుంది.
.