త్వరలో ఒకే వేదికపై ఎన్టీఆర్, మహేష్ బాబు

Mahesh With Junior NTR
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్.. స్టార్ హీరో మహేష్ బాబు.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కన్పించనున్నారు.
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ – 1 మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తుంది.
ఇదే నిజమైతే సూపర్ స్టార్ .. యంగ్ టైగర్ అభిమానులకు పండుగనే.. దేవర ట్రైలర్ ఈ నెల పదో తారీఖున ముంబైలో విడుదల చేయనున్నారు.