రహేజా గ్రూప్ భారీ విరాళం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు.
వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.