మంత్రి సీతక్కను ఫోన్ లో తిట్టిన వ్యక్తి అరెస్ట్

Minister Seethakka
తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు ఓ వ్యక్తి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల నాలుగో తారీఖున గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ నంబరు నుండి మంత్రి సీతక్కకి కాల్ చేశాడు.
మంత్రి సీతక్కకు మూడు సార్లు కాల్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు మంత్రి సిబ్బంది. మంత్రి కారు డ్రైవర్ తో పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేయించారు.
దీంతో పిర్యాదును అందుకున్న పోలీసులు మంత్రికి ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొబైల్ నంబరు ఆధారంగా సదరు నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.