ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా..?
ఈరోజుల్లో కాఫీనో.. టీ నో తాగని వారు ఉండరంటేనే అతిశయోక్తి కాదేమో..?. కాఫీ లేనిది రోజు గడవదు.. టీ లేనిది రోజు ముగియదు. అయితే ఉదయాన్నే కాఫీ తాగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.
ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి 11.30గంటల లోపు ఈ సమయంలో కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మన శరీరంలోని సహజ హార్మోన్లు మరింత స్థిరంగా ఉండేందుకు కాఫీ దొహదపడుతుంది. కాఫీ అయిన టీ అయిన మితంగా సమయానుగుణంగా తాగితే ఆరోగ్యానికి మంచిది . అంతేకానీ దొరికింది కదా అని అమితంగా తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు సైతం ఎదురవ్వచ్చు.