మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారా…?

 మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారా…?

RK Roja Former Minister

ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు.

ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడూతూ ” నా కంఠంలో ప్రాణమున్నంతవరకు వైసీపీలోనే ఉంటాను.. చివరివరకు మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితోనే నడుస్తాను అని” తేల్చి చెప్పారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ ” రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది..వారిపై దాడులు.. అఘాత్యాలు ఎక్కువైపోతున్నాయి. వారికి రక్షణ కరువైంది..గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణం.. బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందినవారిని శిక్షించాలని” ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *