తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషనర్ పార్ధసారధి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీ నేతలతో ఈసీ కమీషనర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరిలోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధితాధికారులకు సూచించడం జరిగింది.
నవంబరు లేదా డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్,కులగణన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెల్సిందే.. ఇదంతా కొలిక్కి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.