SC వర్గీకరణపై కమిటీ

6 total views , 1 views today
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి గారు, మట్టా రాగమయి గారు, చిక్కుడు వంశీకృష్ణ గారు, కేఆర్ నాగరాజు గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, మాల మహానాడు నేతలు చెన్నయ్య గారు తదితరులు ఉన్నారు.
