N-కన్వెన్షన్ లో అన్ని అక్రమ నిర్మాణాలే
టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఐపీఎస్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఎన్ -కన్వెన్షన్ లీజుదారులుగా హీరో నాగార్జున ,ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. దీన్ని చెరువులో నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల అధికారులతో కూల్చివేతలను చెపట్టాము అని అందులో పేర్కొన్నారు.
HMDA 2014లో తమ్మిడికుంట FTL ,బఫర్ జోన్ లు గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆ తర్వాత 2016లో తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2014నాటి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించారు. FTL నిర్ధారణకు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆధేశించింది. దాని ప్రకారం అధికారులు మరోసారి FTL సర్వే చేపట్టి 2017లో నివేదిక అందజేశారు. దానిపై సదరు సంస్థ మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వేసిన వ్యాజ్యం విచారణలో ఉంది. అంతే తప్పా ఈ వ్యవహారంలో ఏ న్యాయస్థానం ఇంతవరకూ స్టే ఇవ్వలేదు.
కుంటవిస్తీర్ణం 29ఎకరాల 24 గుంటలు.. అందులోని 1 ఎకరం 12 గుంటల మేర FTL ను ,2 ఎకరాల 18గుంటలు బఫర్ జోన్ ను N-Convention నిర్మాణాలు అక్రమించాయి. వీటికి అనుమతుల్లేవు. అక్రమ నిర్మాణాలను బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునేందుకు యాజమాన్యం దరఖాస్తు చేసుకోగా సంబంధితాధికారులు తిరస్కరించారు. మాదాపూర్ లో కురిసే వానంతా ఈ చెరువులోకే వెళ్లాల్సి ఉంది. అక్రమణలతో 50-60శాతం కుంచించుకుపోయింది.. దానివల్ల వరద నీరు రోడ్లపై నిలుస్తోంది. చెరువుకు వెలుపల ఉన్న కాలనీలు నీట మునుగుతున్నాయని ” ఆ ప్రకటనలో రంగనాథ్ పేర్కోన్నారు.