YSRCP MLC దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్
AP:- ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో సన్నిహితంగా ఉంటున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి కొన్ని రోజులుగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెల్సిందే..
ఈ వార్త రెండు ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ నేపథ్యంలో తన కుటుంబ వివాదంతో రచ్చకెక్కిన ఆయనకు వైసీపీ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ ను నియమించింది.
ఇకపై నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను తిలక్ సమన్వయ పరుస్తారని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.