బీర్ తాగేవాళ్లకు అలెర్ట్
ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటారు.
అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే నిర్వహించారు… ఈ సర్వేలో డైలీ డ్రింకింగ్ 33% అకాల మరణాన్ని పెంచుతుంది..
అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదం 39% పెరిగిందని తేలింది. అప్పుడప్పుడు తాగితే అకాల మరణం పొందేందుకు 10% ఛాన్స్ ఉంది. అందుకే మద్యానికి దూరంగా ఉండండి, ఎక్కువకాలం జీవించండి..