మహబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభణ

Breaking News
తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది.
అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు.
దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ,వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోని ఈ విపత్తు నుండి తమను కాపాడాలని కోరుతున్నారు.