నిర్మాత “దిల్” రాజు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ స్టార్ నిర్మాత “దిల్” రాజు రేవు మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా “దిల్” రాజు మాట్లాడుతూ ” ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రాకుండా చెడగొట్టేది మేమే “అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఓటీటీలు ఏలుతున్న ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం.. గొప్ప కాదు కానీ తీసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే పెద్ద సవాల్ గా మారింది. మీడియా మంచి రివ్యూలు రాస్తే తప్పా ఆడియన్స్ సినిమా హాళ్లకు రావడం లేదు.
ప్రేక్షకులను చెడగొట్టింది మేమే.. తీసిన సినిమా సినిమా హాళ్లల్లో విడుదల చేస్తాము.. విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో వస్తాయని ప్రకటిస్తాము. ఇక అలాంటప్పుడు ఆడియన్స్ ఎందుకు సినిమా హాళ్లకు వస్తారు అని “దిల్” రాజు ప్రశ్నించారు.