Apలో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లు

Kinjarapu Ram Mohan Naidu- Minister of Civil Aviation of India
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము.
శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.