రైల్వేలో 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ: అశ్వినీ వైష్ణవ్..

దేశంలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు.
బీహార్లోని బెట్టియా జంక్షన్లో మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నమో, వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.
