6అబద్ధాలు..30వేల కోట్ల అప్పులుగా రేవంత్ 6నెలల పాలన
ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. ఇవి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన అలవికానీ ఎన్నికల హామీలు..
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిన ఆసరా గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇచ్చిన రెండు వేలు ఇప్పుడు నెల దాటి వారం రోజులైన ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులు వాపోతున్నారు.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చిన వాటిపై మాజీ సీఎం కేసీఆర్ బొమ్మ ఉందనే నెపంతో వాటిని పంపిణీ చేయకుండా ఆపేశారు..రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కళ్యాణలక్ష్మీ చెక్కులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయాలనందు మూలాన పడి ఉన్నాయి.. ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదోందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందని పథకం అంటే ఆసరా,కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలను లబ్ధిపొందేవాళ్లకు ఇవ్వము అని వీటిలో కోతపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుసగుసలాడుతున్నారు..ఆరుగాలాల పాటు కష్టపడి పండించే పంట చేతికి రాక.. పండిన ఆ పంటకు సరైన మద్ధతు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే రైతులకు అండగా ఉండటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన గొప్ప పథకం రైతుబంధు. అలాంటి పథకం మేమోస్తే ప్రతి రైతుకు పదిహేను వేలు ఇస్తామని రైతుల ఓట్లను వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక పదిహేను వేలు కాదు పదివేలు ఇవ్వడానికి కూడా మీనమేసాలు లెక్కపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతను..నిరుద్యోగులను రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాము..ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులు ఇస్తామని మాయ మాటలు చెప్పి తీరా ఇప్పుడు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి..పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెల్లడించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో వాయిదాపడిన ముప్పై వేల ఉద్యోగ నియామకాలను ఇప్పుడు అట్టహాసంగా తామే నోటిఫికేషన్ ఇచ్చి..పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ముప్పై వేల కొలువులు ఇచ్చామని పబ్లిసిటీ స్టంట్ల్ వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. వీటిలో తాజాగా గురుకుల అభ్యర్థులకు బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ వారికి అన్యాయం చేస్తుంది ..ఇలా ఒక్కటేమిటి దాదాపు ఆరు గ్యారంటీలల్లో ఒక్కొక్క గ్యారంటీలో మూడు రెండు అంశాలను జోడించి మొత్తం 15హామీలల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి అది కూడా అరకొర బస్సుల సదుపాయంతో అమలు చేసి మొత్తం ఆరు గ్యారంటీలను పూర్తి చేశామని పత్రికల్లో టీవీల్లో ప్రకటలను ఊదరగొడుతుంది కాంగ్రెస్ సర్కారు..
ఒకవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పటికే ముప్పై వేల కోట్లను అప్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు.. రుణమాఫీ చేయలేదు..ఆసరా ఫించన్ ఇవ్వలేదు.. లక్షరూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం లేదు. రైతుభరోసా కింద రైతులకు పదిహేను వేలు కాదు పదిహేను పైసలు కూడా అందజేయలేదు..ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు ఇవ్వలేదు కానీ ముప్పై వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆర్ధం కాక తలలు పట్టుకుంటూ రేవంత్ రెడ్డి పాలన ఆరు నెలలు..ఆరు అబద్ధాలు..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగింది..ఇలాగే ఉంటే ఐదేండ్లు పూర్తయ్యేసరికి మొత్తం అప్పులు మూడు లక్షల కోట్లు అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు…