ట్రంప్ గెలుపుకు 5ప్రధాన కారణాలు…? -ఎడిటోరియల్ కాలమ్

 ట్రంప్ గెలుపుకు 5ప్రధాన కారణాలు…? -ఎడిటోరియల్ కాలమ్

Donald Trump U.S. President-

ప్రపంచమంతటా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ లీడర్ కమలా హారిస్ పై రిపబ్లికన్ పార్టీ లీడర్ డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది ” గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలిచే ఉంటుంది. ఈ డైలాగ్ ను అక్షరాల నిజం చేశాడు ట్రంప్. ఎందుకంటే దాదాపు 132ఏండ్ల తర్వాత అధ్యక్షుడిగా పనిచేసి ఓడిన తర్వాత మళ్లీ అధ్యక్షుడిగా గెలిపొందిన ఏకైన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్. అంతటి ఘనమైన చరిత్ర ఉంది తాజా విజయానికి. ఈ విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1)ఎలన్ మస్క్ 2)హత్యాప్రయత్నంతో సానుభూతి 3) అన్ని వర్గాల మన్నలను పొందటం 4) దేశం ఫస్ట్ అనే నినాదం 5) ప్రత్యర్థి.

మొదటిది ఎలన్ మస్క్ డోనాల్డ్ ట్రంప్ కు చేసిన సాయం అంత ఇంతా కాదు. ఒకవైపు ఏకంగా 119మిలియన్ డాలర్లను ఆర్థికసాయంగా అందించాడు. మరోవైపు తన ఆధీనంలో ఉన్న ట్విట్టర్ లో ట్రంప్ కు అనుకూలంగా.. ప్రత్యర్థి అభ్యర్థి కమలా హరీస్ కు వ్యతిరేకంగా పబ్లిసిటీ అందించడంలో చాలా కృషి చేశాడు. ఈ ప్రయత్నంలో ఎలన్ మస్క్ వార్నింగ్ లు కూడా చూడాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ వ్యాపార వేత్త ఇంతలా మద్ధతు ఇవ్వడం ఇటీవల కాలంలో అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం అన్నంత స్థాయిలో ట్రంప్ కు మస్క్ అండగా నిలిచాడు.

రెండోది డోనాల్డ్ ట్రంప్ పై హత్యా ప్రయత్నం జరగడం ..అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌పై ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సార్లు ఈ ప్రయత్నాలు జరిగాయి. అందులో ప్రధానంగా ఈ ఏడాది జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్‌ మాథ్యూ క్రూక్‌ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్‌ మీదినుంచి ట్రంప్ పై కాల్పులు జరపడంతో ట్రంప్‌ కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్‌ రక్తమోడుతూనే అమాంతం డయాస్‌ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్న కానీ ఈ ఘటనలో ఆయన మద్ధతుదారుడు ఒకరూ చనిపోయారు. ఈ ఘటనే రాజకీయ సమీకరణాలను మార్చేశాయి.. దీంతో సురక్షితమైన అమెరికాను కోరుకునేవాళ్లంతా ట్రంప్ వైపు రావడంతో సింపతీ బాగా పని చేసింది.

మూడోది డోనాల్డ్ ట్రంప్ అంటే ఓ వ్యాపార వేత్త అనే దగ్గర నుండి అందరివాడు అన్పించుకోవడం కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి కారణమైంది. ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుండి మన దేశంలో ఓ రాజకీయ నాయకుడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడానికి ఏ ఏ పనులు అయితే చేస్తాడో అంతే మాదిరిగా ట్రంప్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకొవడానికి తనదైన శైలీలో పని చేసి సక్సెస్ అయ్యాడు. మెక్ డోనాల్డ్ లో పని చేశాడు.. రోడ్లపై చెత్తను ఊడ్చాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన చేసిన గార్భేజ్ ప్రచారం బాగా పనిచేసింది.

నాలుగోది దేశం ఫస్ట్ అనేనినాదం.. ఇదే నినాదంతో గతంలో ట్రంప్ గెలుపొందిన కానీ తాజా ఎన్నికల్లో మాత్రం దాని రూటు మార్చి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు.. విషయం ఏదైన సరే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని జనం మదిలోపలకి తీసుకెళ్లడంతో ట్రంప్ విజయవంతమయ్యాడు. అది ఇమ్మిగ్రేషన్ అయిన ఉపాధి అయిన ఉద్యోగకల్పనలో అయిన.. ఉద్యోగ భద్రత అయిన సరిహద్దు వివాదలైన కానీ అంశం ఏదైన సరే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మేలుకో అమెరికన్ అనే స్లోగన్ తో అమెరికా ను ఊపేశాడు. వీటితో పాటు అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే వలసదారులను దేశం నుండి పంపిస్తాను.. సరిహద్దు ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తాను.పన్నులు తగ్గిస్తాను.. విదేశీ దిగుమతులపై సుంకాన్నీ పెంచుతాను.. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పడం కూడా అమెరికన్లు అంగీకరించారు.

చివరగా ప్రత్యర్థి అయిన కమలా హారీస్ ను ట్రంప్ మద్ధతుదారులు బలహీనురాలు అని చేసిన ప్రచారం బాగా కల్సివచ్చింది.. అధ్యక్ష రేసు నుండి తాజా మాజీ అధ్యక్షుడైన బైడెన్ తప్పుకోని హారీశ్ ను ప్రకటించిన రోజే ట్రంప్ గెలుపు లాంచనమైంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రోజు కమలా హారీస్ ప్రజాధరణను చురగొనడానికి చేయని ప్రయత్నం లేదు.. వీలు చిక్కినప్పుడల్లా ప్రజల నుండి మద్ధతు కూడగట్టుకోవడానికి హారీస్ చాలా కష్టపడ్డారు.. అయితే ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ విమర్శలను ఈమె తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. మరోవైపు విదేశాల్లో ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడం లో హారీస్ బైడెన్ జోడీ విఫలమయ్యారు అని చెప్పడంలో ట్రంప్ తనదైన మార్కును ప్రదర్శించాడు. ఈ ఐదు ప్రధాన కారణాలతో ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా గెలుపొందారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *