ఏపీలో కొత్తగా 4 ఎయిర్ పోర్టులు

4 new airports in AP
5 total views , 1 views today
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో నాలుగు ఎయిర్ పోర్టులను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
వచ్చే ఏడాది నాటికి ఈ నాలుగు పోర్టులతో పాటు నాలుగు హర్బర్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
పోర్టులు, హర్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అటు పీపీపీ విధానంలో రద్ధీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు.