4గురు పిల్లలుంటే 400ఎకరాలు ఉన్నట్లే..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు.
ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో ఘనంగా నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” మనదేశానికి జనాభే అతి పెద్ద ఆదాయ వనరు.
ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పాను. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెబుతున్నను. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే నాలుగోందల ఎకరాలు ఉన్నట్లే. జపాన్, కోరియో తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా నలుగురు పిల్లలని కంటే లక్ష రూపాయల బహుమతిని ప్రకటించించిందని పిలుపునిచ్చారు.