ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు

Ponnam Prabhaker
15 total views , 1 views today
తెలంగాణ ఆర్టీసీ లో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ లో ఉద్యోగులకు పీఆర్సీ, సంబంధిత బకాయిలన్నీ దసరా లోపు అందజేస్తాము.. కారుణ్య సంబంధిత ఉద్యోగాల భర్తీపై దృష్టి పెడతాము.
కాలుష్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్ఆర్ పరిధిలోపల డిజీల్ తో నడిచే బస్సులను తగ్గిస్తాము. హైదరాబాద్ తో సహా జిల్లాలకు ఎలక్ట్రికల్ బస్సులను నడిపిస్తాము అని ఆయన అన్నారు.
