2లక్షల రూపాయల ఎల్వోసీ అందజేత

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న పోల మనస్విని తండ్రి శంకర్ వయస్సు 20 సంవత్సరాలున్న యువతి తకాయసు ఆర్థరైటిస్ తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి తండ్రి శంకర్ గారు కూకట్పల్లి లోని కాంగ్రెస్ యువనాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు( జీవీఆర్ )ను ఆయన కార్యాలయం లో సంప్రదించారు.
శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి దరఖాస్తు చేయడం జరిగింది. వారికి రెండో దఫా 2,00,000 రూపాయల ఎల్వోసీ ప్రభుత్వం నుండి మంజూరు అయ్యింది.(వారికి ఇంతకు ముందు 29 అక్టోబర్ 2024 రోజున 2,50,000.రూపాయల ఎల్వోసీ అందజేయడం జరిగింది).
ఆ ఎల్వోసీ లెటర్ ను శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మరియు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు గార్ల చేతుల మీదుగా మనస్విని తల్లి శకుంతల గారికి అందజేయడం జరిగింది…ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి ,జగదీశ్వర్ గౌడ్ మరియు జీవీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు….
