కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?
తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల ప్రజల తరపున.. రైతుల పక్షాన మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కాకపోతే ఎవరూ ప్రజలకు అండగా ఉంటారని ప్రభుత్వాన్ని..రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఇంత బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు అసలు అధికారులు ఎందుకు ఆయా గ్రామాల్లోకి వెళ్లారు. అతితక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ప్రభుత్వం ఏదైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు.భూములను సేకరించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయాలను చూపించాలని ఆయన అన్నారు.