పోసానికి 14రోజులు రిమాండ్..!

ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి ను కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు నిన్న మంగళవారం అర్ధరాత్రి పోలీసులు హజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నటుడుపోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు..
గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు నుంచి అరెస్ట్ చేశారు..
అనంతరం పోలీసులు కర్నూలు న్యాయమూర్తి ముందు అర్ధరాత్రి హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు..ఈ క్రమంలో న్యాయమూర్తిని పోసాని ఆరోగ్యం సరిగా లేనందున కర్నూల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచాలని కోరారు.. ఆయన వాదనను విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలోనే 14 రోజుల ఉంచాలని అదేశాలిచ్చారు.దీనితో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించిన పోలీసులు
