నేడే ఖాతాల్లో రూ.10,000లు జమ
తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీచ్చిన సంగతి తెల్సిందే.
దీంతో ఈరోజు ముందుగా పదివేల రూపాయలను తక్షణ ఆర్థిక సాయం కింద జమచేస్తుంది ప్రభుత్వం. మరోవైపు పాడి పశువులు చనిపోతే యాబై వేలు.. మేకలు,గొర్రెలు చనిపోతే ఐదు వేలు ఇస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసింది.