ప్రతి ఇంటికి రూ.10,000-సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరద బాధితులను పరామర్శిస్తూ సీతారాం తాండలో యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అశ్విని మృతి చాలా బాధాకరం.. ఆశ్విని కుటుంబానికి అండగా ఉంటాము.. సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాము. వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాము..
ప్రతి ఇంటికి పదివేల రూపాయలు తక్షణ సాయం కింద ఇస్తాము.. ఇల్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి తీరుతాము. ప్రతి ఒక్కర్కి అండగా ఉంటాము.. వరదలకు నష్టపోయిన వారిని ఆదుకుంటాము. వరదల వల్ల వర్షాల వల్ల ఐదువేల కోట్ల నష్టం వాటిల్లింది అని ” పేర్కొన్నారు.