వేణుస్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు
ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో అక్కినేని నాగచైతన్య ,శోభిత వివాహాం చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్ధరి వివాహాం గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.
వీరిద్దరి గురించి మాట్లాడుతూ ” నాగచైతన్య ,శోభిత త్వరలోనే విడిపోతారు. వీరు ఎక్కువ కాలం కల్సి ఉండరు అని జ్యోతీషం చెప్పిన సంగతి విధితమే. అయితే తాను సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జ్యోతిష్యం చెప్పను అని మళ్లీ చైతూ శోభిత ల గురించి చెప్పారు ఎందుకు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.
అక్కడితో ఆగకుండా వేణుస్వామి ఆ ట్రోల్స్ కు సమాధానం ఇస్తూ ” ఇది చైతూ-సమంతలకు కొనసాగింపుగా చెప్పాను. ఇకపై చెప్పను. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఫోన్ చేశారు. అందుకే ఇకపై జాతకాలు చెప్పను అని తేల్చి చెప్పారు.వేణుస్వామి వ్యాఖ్యలపై సినీటీవీ రంగాలకు చెందిన మహిళలు మహిళా కమిషన్ కు పిర్యాదు చేయడంతో కమిషన్ ఈ నెల ఇరవై రెండో తారీఖున కమీషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.