నిన్న హెచ్ సీయూ – నేడు ఫార్మాసిటీ -తీరు మారని రేవంత్ రెడ్డి..!

Yesterday HCU – today Pharmacity – Revanth Reddy’s unchanging course..!
ఇప్పటికే హెచ్ సీయూ భూముల వ్యవహారంలో జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకోవడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతి మరిచిపోకముందే మరోకసారి ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం మరో అడుగు వేసింది.
ఇప్పటికే ఫార్మాసిటీ కోసం తమ భూములను తీసుకోవద్దు అక్కడి రైతులందరూ ధర్నాలు చేశారు. అయిన కానీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వం నిన్న సోమవారం నూట యాబై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ,ఇద్దరూ ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు.. పదిహేను మంది ఎస్సైలతో పాటు మరో రెండోందల మంది స్పెషల్ బలగాలతో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల దగ్గర భారీ బందోబస్తు గా ఉన్నారు.
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండల రెవిన్యూ అధికారులు హద్దులు గుర్తించి కంచెను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం వరకూ కందుకూరు – యాచారం మండలాల సరిహద్దు వరకూ ఫార్మాసిటీ భూముల సరిహద్దులను గుర్తించారు. రెండు కిలోమీటర్ల వరకూ కంచె పూర్తి చేయగా మరో ఇరవై ఐదు కిలోమీటర్లు వేస్తే పూర్తవుతుందని రెవిన్యూ అధికారులు తెలిపారు.
